కోపం కూడా ఒక భావోద్వేగమే. సంతోషం ఎలాంటిదో కోపం కూడా అటువంటిదే. అందుకే కోప్పడకూడదని చెప్పడం కరెక్ట్ కాదు. మీకు కోపం వచ్చి కోప్పడద్దన్నారు కదా అని చెప్పి కోపాన్ని నియంత్రిస్తూ ఉంటుంటే అదింకా పెద్ద ప్రమాదానికి దారి తీయవచ్చు. భావోద్వేగాలను ఆపుకోవడం అనేది ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రస్తుతం గురించి అందరూ నమ్మే అపోహాలను తెలుసుకుందాం.
కోపం సాధారణ భావోద్వేగం కాదు
నిజం: కోపం కూడా సాధారణ భావోద్వేగమే. నాకసలు కోపమే రాదు అని చెప్పేవాళ్ళు కూడా అబద్ధం చెబుతుంటారు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కొందరేమో గట్టిగా అరిస్తే, మరికొందరేమో తమ లోపలే ఉంచుకుంటారు. కోపాన్ని ప్రదర్శించడం సాధారణ భావోద్వేగమే.
కోపాన్ని అణచుకోవడానికి భావాల్ని పక్కన పెట్టాలి
నిజం: కోపం అణచాలంటే మీ ఆలోచనలు పక్కన పెట్టడం కరెక్ట్ కాదు. ఇది కూడా ఒక్కో వ్యక్తికి ఒక్కోలా ఉంటుంది. కోపాన్ని అణచుకుని లోపలే పెట్టుకున్న చాలామందిలో అది పెరిగి పెరిగి పెద్ద హింసకు దారి తీయవచ్చు.
కోపం వచ్చిన వాళ్ళని ఎదుర్కోవడం సాయపడుతుంది
నిజం: ఇది అస్సలు కరెక్ట్ కాదు. కోప్పడుతున్న వ్యక్తిని ఎదుర్కుంటే మరింత కోపం పెరిగే అవకాశం ఉంది. వాదనల వల్ల కోపాలు పెరుగుతాయి. కావాల్సి వస్తే క్షమాపణ కోరవచ్చు. దానివల్ల పరిస్థితులు మెరుగుపడతాయి.
కోపం రాగానే బయటకు వెళ్ళిపోవడం మేలు చేస్తుంది
నిజం: ఇది కూడా మనిషికీ మనిషికీ తేడా ఉంటుంది. కోపం రాగానే బయటకు వెళ్తే చాలామందిలో కోపం తగ్గుతుంది. కానీ కొందరిలో అది ఇంకా పెరుగుతుంది. దాన్నుండి బయటకు రావడానికి చాలా టైమ్ పడుతుంది.