వరల్డ్ క్లాస్ సినిమా ఇది..RRRపై బాలీవుడ్ సీనియర్ హీరో ప్రశంసల వర్షం

-

టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా ఈ ఏడాది మార్చి 25న విడుదలైన సంగతి అందరికీ విదితమే. ఈ పిక్చర్ చూసి మన దేశమే కాదు ప్రపంచం కూడా ఫిదా అయిపోయింది. సినీ లవర్స్ అందరూ ఈ మూవీ చూసి వావ్ అన్నారు. ఇక ఈ సినిమాతో తెలుగు సినిమా, రీజినల్ సినిమా అనేది ఉండబోదని, పాన్ ఇండియా పిక్చర్‌గా సౌత్ సినిమాలు ఉంటాయని అందరూ అంటున్నారు.

సౌత్ పిక్చర్స్ చూసి నార్త్ ఇండియా ఆడియన్స్ కూడా ఫిదా అవుతున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా సూపర్బ్ మూవీస్ అంటున్నారు. అయితే, కొందరు సౌత్ సినిమాల పట్ల అక్కసు వెళ్లకక్కుతున్నారు. కానీ, అల్టిమేట్ గా మెజారిటీ సెలబ్రిటీలూ RRR సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ ఆర్ఆర్ఆర్ సినిమా చూసినట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు. సినిమా గురించి తన అభిప్రాయాన్ని ట్వీట్ చేశారు. ఇటీవల కాలంలో ఇంత మంచి సినిమా రాలేదని, ఇది అందరికీ ట్రీట్ లాంటి పిక్చర్ అని , RRR వరల్డ్ క్లాస్ సినిమాని పేర్కొన్నారు అనిల్ కపూర్.

ఈ క్రమంలోనే మూవీ యూనిట్ సభ్యులందరికీ శుభాకాంక్షలు చెప్పారు. సౌత్ సినిమాలు చాలా బాగుంటాయని ఇటీవల ఓ కార్యక్రమంలో అనిల్ కపూర్ పేర్కొన్నారు. తన సినీ కెరీర్ సౌతిండియాలోనే స్టార్ట్ అయిందన్న సంగతి అనిల్ కపూర్ గుర్తు చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news