ఆపదలో ఉన్న పిల్లిని కాపాడటం కోసం ఈమె ఎంతటి సాహసం చేసిందో తెలుసా?

-

ప్రజెంట్ సోషల్ మీడియా వరల్డ్‌లో ఎవరు ఏ ఇంట్రెస్టింగ్ పని చేసినా వెంటనే తెలిసిపోతుంది. క్షణాల్లోనే అందుకు సంబంధించిన వీడియోస్ వైరల్ అవుతున్నాయి. అలా యూనిక్ కంటెంట్‌కు సోషల్ మీడియా వేదికగా మారుతోంది. ప్రమోషన్ వెరీ ఫాస్ట్ ప్లస్ ఈజీగా అయిపోతున్నది. తాజాగా ఓ మహిళకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇంతకీ ఆమె ఏం చేసింది? ఎవరి కోసం అంత సాహసం చేసి వీరనారిగా మారింది? అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ స్టోరీని కంప్లీట్‌గా రీడ్ చేయాల్సిందే.సాధారణంగా మనకు నచ్చిన వస్తువును దేన్నైనా వదులుకునేందుకు సిద్ధపడబోం కదా.. ఇకపోతే వస్తువుకు అంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మనిషి లేదా పెంపుడు జంతువుకు ఎంత ప్రాధాన్యతిస్తామో అందరికీ తెలిసే ఉంటుంది. ఈ క్రమంలోనే క్యాట్‌ను కాపాడేందుకు వెరీ బిగ్ రిస్క్ చేసింది ఓ మహిళ. వివరాల్లోకెళితే..కర్నాటకలోని మంగళళూరులో ఉండే రజనీ దామోదర్‌శెట్టి దంపతుల ఇంటి పక్కనే ఉండే పాడుపడ్డ బావిలో పడిపోయింది చిన్ని పిల్లి.

ఇంక అందులో నుంచి పిల్లి అరుపులు విన్న సదరు రజనీ భర్త సాయంతో బావిలోకి దిగేసింది. ఆ బావి చూడ్డానికి భయంకరంగా ఉన్నప్పటికీ ఆమె ధైర్యం చేసింది. చెట్లు, పొదలు ఉన్నప్పటికీ జంకు లేకుండా తాడు సాయంతో అందులోకి పిల్లి పిల్లను ఓ సంచిలో వేసుకుని పైకి తీసుకొచ్చింది. వీరనారి మాదిరిగా రెండొందల అడుగుల బావిని క్షణాల్లోనే దిగి మళ్లీ పైకి ఎక్కింది. క్యాట్ ప్రజెంట్ సేఫ్‌గా ఉండగా, ఇదంతా వీడియో రూపంలో రికార్డు చేసి షేర్ చేయగా, నెట్టింట అది ట్రెండవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు వీరనారి రజనీ అన్ని కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news