మంత్రి కేటీఆర్ తో ఒవైసీ కీలక సమావేశం

-

పాతబస్తీలో వివిధ పథకాల కింద చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో అమలులో మరింత వేగంగా వ్యవహరించాలని పురపాలక శాఖ అధికారులకు మంత్రి తారక రామారావు సూచించారు. ఈ రోజు హైదరాబాద్ పాతబస్తీలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ, మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో పురపాలక శాఖ అధికారులు వివిధ అ పథకాలు కార్యక్రమాల కింద చేపట్టిన పనుల పైన వివరాలను అందజేశారు. పాతబస్తీలోని వివిధ నియోజకవర్గాల్లో ఎస్సార్డిపి కింద నిర్మాణం అవుతున్న ఫ్లై ఓవర్లు, రహదారులు,  నాలాల వెడల్పు కార్యక్రమం, రెండు పడక గదుల నిర్మాణం, త్రాగునీటి రిజర్వాయర్, పైపులైన్లు, ఇతర మౌలిక సదుపాయాల ప్రగతి గురించి సుదీర్ఘ సమీక్ష మంత్రి కేటీఆర్ చేశారు. ఆయా పనుల అమలులో ఎక్కడైనా అనుకోని అవాంతరాలు ఎదురైతే వెంటనే తన దృష్టికి తేవాలని, పనులన్నీ సమయానికి పూర్తి అయ్యేలా ఉన్నతాధికారులు శ్రద్ధ వహించాలి అని మంత్రి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news