ఏపీకి మరో అరుదైన గౌరవం దక్కింది. వరుసగా రెండో సారి కూడా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంటూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం… దేశంలోనే నంబర్ 1 గా నిలిచింది. స్కోచ్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఆంధ్ర ప్రదేశ్ వరుసగా రెండో ఏడాది కూడా మొదటి స్థానం దక్కింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ప్రాజెక్టు స్థాయి ఫలితాల అధ్యయనం ఆధారంగా సీఎం ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను ఎంపిక చేసినట్లు స్కోచ్ గ్రూపు చైర్మన్ సమీర్ కొచ్చర్ తెలిపారు.

పరిపాలనలో సంస్కరణలు, విప్లవాత్మక పథకాలతో సంక్షేమాన్ని ప్రజల ముంగిటికే తెచ్చిన ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను ‘సీఎం ఆఫ్ ద 2021 ఇయర్’ అవార్డుకు ఎంపిక చేసింది స్కోచ్ గ్రూపు. ఇందులో భాగంగానే పాలనలో ఉత్తమ ప్రతిభ విభాగంలో ఏపీకి మొదటి స్థానం దక్కింది. 2021 స్కోచ్ ర్యాంకుల్లో సత్తా చాటిన ఏపీ… వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పోలీసు రక్షణలో ఫస్ట్ ర్యాంకు సాధించింది. జిల్లాల పరిపాలనలోనూ ఏపీకి మొదటి స్థానం దక్కింది. ఈ-గవర్నెన్స్ లో రెండో స్థానం దక్కగా… ట్రాన్స్‌ఫోర్ట్ విభాగంలో మూడో స్థానంలో నిలిచింది ఏపీ సర్కార్.
2021 స్కోచ్ ర్యాంకుల్లో సత్తా చాటిన ఏపీ. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పోలీసు రక్షణలో ఫస్ట్ ర్యాంకు సాధించిన ఏపీ. జిల్లాల పరిపాలనలోనూ ఏపీకి మొదటి స్థానం. ఈ-గవర్నెన్స్ లో రెండో స్థానం. ట్రాన్స్‌ఫోర్ట్ విభాగంలో మూడో స్థానంలో నిలిచిన ఏపీ. #SkochForYSJaganGovernance pic.twitter.com/aScGUoeqx0
— YSR Congress Party (@YSRCParty) March 9, 2022