ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడి రామచంద్ర భారతిపై మరో కేసు

-

మొయినాబాద్‌ ఫాంహౌస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రామచంద్ర భారతిపై మరో కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. ఆయన ఒకటి కంటే ఎక్కువ ఆధార్, పాన్ కార్డులు కలిగి ఉన్నారని తేలడంతో.. పోలీసులు మరో కేసు నమోదు చేశారు. రూల్స్ ప్రకారం ఎవరూ కూడా తమ పేరు మీద ఒకటి కంటే ఎక్కువ ఆధార్ లేదా పాన్ కార్డులు కలిగి ఉండకూడదు. కానీ రామచంద్ర భారతి ఒకటి కంటే ఎక్కువ ఆధార్, పాన్ కార్డులు కలిగి ఉన్నట్లు ఇటీవల సీఎం కేసీఆర్ కూడా ప్రెస్‌మీట్‌లో ఆధారాలు బయటపెట్టారు. ఈ క్రమంలో తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన రిప్రెజెంటేషన్ ఆధారంగా రామచంద్ర భారతిపై బంజారాహిల్స్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.

రామచంద్ర భారతి ఆశ్రమంలో తెలంగాణ పోలీసుల తనిఖీలు!

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంపై పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతోన్నారు. ఆ కేసుతో సంబంధం లేకుండా బంజారాహిల్స్ పోలీసులు రామచంద్ర భారతిపై ప్రత్యేకంగా ఈ కేసు నమోదు చేశారు. మొయినాబాద్ పోలీసులు ఇచ్చిన సమాచారంతో సంబంధం లేకండా రోహిత్ రెడ్డి ఇచ్చిన రిప్రెజెంటేషన్ ఆధారంగానే బంజారాహిల్స్ పోలీసుల కేసు ఫైల్ చేశారు.

 

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బేరసారాల కేసులో ఢిల్లీకి చెందిన రామచంద్రభారతితో పాటు తిరుపతికి చెందిన సింహయాజులు, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌లను అక్టోబర్ 26వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాలతో ముగ్గురు నిందితులను జ్యూడీషియల్ రిమాండ్‌లో ఉంచారు. ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఈ ముగ్గురు ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో ఏ1గా రామచంద్రభారతి, ఏ2గా నందకుమార్, ఏ3గా సింహయాజులు స్వామి ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news