నిజాం కాలేజ్ విద్యార్థినుల ఆందోళనపై స్పందించిన కేటీఆర్‌

-

హాస్టల్ అలాట్మెంట్ సమస్య పరిష్కరించాలని కోరుతూ నిజాం కాలేజ్‌ విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా నిజాం కాలేజ్ విద్యార్థినుల ఆందోళనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. హాస్టల్ అలాట్మెంట్ సమస్యను పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు మంత్రి కేటీఆర్. ఈ విషయంలో జోక్యం చేసుకుని సమస్యను వెంటనే పరిష్కరించేలా చూడాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సూచిస్తూ ట్వీట్ చేశారు. తాను ఇచ్చిన మాట ప్రకారం హాస్టల్ నిర్మించి కాలేజీకి అందించిన తర్వాత వివాదం అవసరమా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ సమస్యకు వెంటనే ముగింపు పలకాలని నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్కు ఆదేశించారు. కేటీఆర్ ట్వీట్ పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. నిజాం కాలేజ్ విద్యార్థినుల హాస్టల్ సమస్యను స్వయంగా పర్యవేక్షించి సాధ్యమైనంత తొందరగా పరిష్కరిస్తానని కేటీఆర్ కు చెప్పారు.

Why is BJP wary of KT Rama Rao as Chief Minister?

నిజాం కాలేజీ ఫస్ట్ గ్రాడ్యూయేషన్ డేకు అటెండైన కళాశాల పూర్వ విద్యార్థి, మంత్రి కేటీఆర్ ప్రభుత్వం తరఫున కాలేజ్ అభివృద్ధికి రూ.5 కోట్ల ఫండ్ కేటాయించారు. ఈ నిధులతో పాటు ఓయూ వీసీ మరో కోటి రూపాయిల ఫండ్ కాలేజీకి అలాట్ చేశారు. ఈ నిధులతో అధికారులు కాలేజీ హాస్టల్ భవనం నిర్మించారు. అయితే ఈ హాస్టల్ ను కేవలం పీజీ విద్యార్థులకు మాత్రమే కేటాయిస్తామని చెప్పడంతో యూజీ విద్యార్థుల గత కొన్ని రోజులుగా ఆందోళన చేపట్టారు. విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి చేరడంతో స్పందించిన ఆయన.. సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news