హైదరాబాద్ కు మరో ప్రమాదం… జాగ్రత్త…!

-

మైలార్ దేవుపల్లి పల్లె చేరువు నుండి కిందకు ఉదృతంగా వరద ప్రవహించడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. చెరువు కోతకు గురి కావడంతో చెరువు కట్ట పరిస్థితి ప్రమాదకర స్థాయిలో ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని స్థానిక ప్రజలు, లోతట్టు ప్రాంతాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థిని జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ , ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ , సైబరాబాద్ సీపీ సజ్జనార్ , ఇరిగేషన్ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు.

coronavirus 8 high risk zones in telangana
coronavirus 8 high risk zones in telangana

పల్లెచెరువు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇల్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు హెచ్చరించారు. మైక్ ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే అలీ నగర్ , సుబాన్ కాలనీ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల్లో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది గల్లంతు అయ్యారని అధికారులు పేర్కొన్నారు. ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా… మిగతావారి కోసం గాలింపు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news