హైదరాబాద్ లో నిన్నా మొన్న కురిసిన వర్షాలు సగం నగరాన్ని నీటిలో ముంచేశాయి. వందేళ్ళలో ఇలాంటి వర్షం కురవడం రెండో సారి అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అయితే ఇప్పటికే చాలా ఆస్తి నష్టం జరిగింది. చాలా వాహనాలు కొట్టుకు పోయాయి. కొన్ని కళ్ళ ముందే ఉన్నా ఇంజన్ ల లోకి నీళ్ళు వెళ్లి ఇబ్బందులు పడుతున్నారు. ఇక చాలా చోట్ల నీళ్ళు ఇంకా సెల్లార్ లలో, కొన్ని కాలనీలలో నిలిచే ఉన్నాయి. దీంతో రెండురోజులుగా సహాయ చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొంటున్నారు.
వరదలోంచి బాధితులను బయటకు తీసుకువచ్చేందుకు ముమ్మరంగా కృషి చేస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. నగరంలో ఎనమిది చోట్ల ఏకకాలంలోరెస్క్యూ ఆఫరేషన్ కి దిగాయి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. ఫలక్ నామా, బాలాపూర్, మీర్ పేట, టోలి చౌకి, సలీం కాలనీ, బిఎన్ రెడ్డి కాలనీ, రామాంతాపూర్, కృష్ణా నగర్, చాంద్రాయణ గుట్ట, సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అయితే నేడు వర్షం కురవకపోతేనే చాలా ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందో ?