పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్షతో పాటు.. పార్లమెంటు సభ్యుడిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనర్హత వేటుకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసు ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. మోదీ ఇంటి పేరును కించపరిచేలా రాహుల్ చేసిన వ్యాఖ్యలకు గానూ.. 2019లో సూరత్ కోర్టులో గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ పరువు నష్టం దావా వేశారు. అలాగే అదే ఏడాది పట్నా కోర్టులో కూడా రాహుల్పై మరో పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో రాహుల్ గాంధీ 2023 ఏప్రిల్ 12న పట్నా కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంది. ఈ దావాను బీజేపీ రాజ్యసభ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ వేశారు.
Video Player is loading.