రవితేజ ఫ్యామిలీ నుంచి మరో వ్యక్తి ఇండస్ట్రీకి ఎంట్రీ…

-

మాస్ మహారాజ్ రవితేజ రవితేజ ఫ్యామిలీ నుంచి మరో వ్యక్తి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. తన కుమారుడు మహాధన్‌ ఇప్పటికే సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిన విషయం తెలిసిందే. రాజా ది గ్రేట్‌ చిత్రంలో రవితేజ చిన్ననాటి పాత్రలో కనిపించాడు రవి తేజ కుమారుడు మహాధన్‌. కాగా త్వరలోనే మహాధన్‌ను కూడా హీరోగా పరిచయం చేసేందుకు రవితేజ రెడీ అవుతున్నాడని ఇప్పటికే ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. కట్‌ చేస్తే. మాధవ్, రవితేజ సోదరుడు రఘు కుమారుడు . పెళ్లి సందడి (డెబ్యూ సినిమా)తో డైరెక్టర్‌గా మంచి బ్రేక్‌ అందుకున్న గౌరీ రోనంకి దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు మాధవ్‌. ప్రొడక్షన్‌ నంబర్‌ 2గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈరోజు చాలా గ్రాండ్‌గా లాంఛ్‌ అయింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు గారు క్లాప్ కొట్టారు.

Raviteja | రవితేజ ఫ్యామిలీ నుంచి మరో యాక్టర్‌.. వివరాలివే

ఈ చిత్రాన్ని యెలమంచి రాణి సమర్పణలో జేజేఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పీ నిర్మిస్తోంది. అనూప్‌ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ కార్యక్రమానికి రవితేజ హాజరు కాలేదు. రవితేజ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల లాంఛింగ్ ఈవెంట్‌కు రాలేకపోయారని నిర్మాత రవిచంద్ చెప్పారు. అయితే చిత్రయూనిట్‌కు రవితేజ శుభాకాంక్షలు తెలియజేశారన్నారు. ఈ మూవీలో ఫీమేల్ లీడ్‌ రోల్‌లో ఎవరు కనిపించబోతున్నారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ లో పెట్టారు మేకర్స్‌. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు. రఘు పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news