సినీ ఇండస్ట్రీ లో మరో విషాదం.. ప్లాస్టిక్ సర్జరీ వికటించి నటి కన్నుమూత

-

కొంతకాలంగా సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు వరుసగా కన్ను మూస్తున్నారు. తాజాగా కన్నడ ఇండస్ట్రీ లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ టీవీ నటి చేతనా రాజ్ కన్నుమూసింది. కాస్మెటిక్ సర్జరీ వికటించడం వల్లనే ఆమె మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. చేతన రాజ్ కన్నడ ఇండస్ట్రీలో పలు టీవీ షోస్, సీరియల్స్ చేశారు. బెంగళూరు లోని డాక్టర్ శెట్టి కాస్మోటిక్ హాస్పిటల్ లో ఆమె సోమవారం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు. ఫ్యాట్ ఫ్రీ కోసం చేతన్ రాజ్ కాస్మోటిక్ సర్జరీని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. కానీ ఆమెకు సాయంత్రం వరకు ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో బాగా ఇబ్బంది పడ్డారట.

డాక్టర్ శెట్టి కాస్మోటిక్ హాస్పిటల్ లో ఐసియు లేకపోవడంతో ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో బాగా ఇబ్బంది పడ్డారట. కానీ అప్పటికే ఆమె పరిస్థితి విషమించడంతో తమ ఆసుపత్రికి వచ్చే సరికే చేతన్ రాజ్ మరణించినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. సోమవారం ఉదయం కుటుంబ సభ్యులకు ఎటువంటి సమాచారం లేకుండా చేతన్ రాజ్ ఇంటి నుండి బయటకు వచ్చారని.. తన స్నేహితులతో కలిసి ఆసుపత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే తమ కూతురు మరణానికి కాస్మోటిక్ సర్జరీ చేసిన డాక్టర్ నిర్లక్ష్యమే కారణమని చేతన్ రాజ్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news