చైనాలో ఈ అద్భుతాన్ని చూశారా?

ప్రపంచ వింతలల్లో ఒకటి అతి పెద్ద వాల్ చైనాలో ఉంది. ఇప్పుడు మరో వింత బయట పడిందని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతుంది.. సాదారణంగా అడవులు అనేవి భూమికి పైన ఉంటాయి. కానీ భూమి లోపల పొదలతో కూడిన అడవులు భూమి లోపల ఉన్నాయని పరిశోధకులు తెలిపారు.ఓ సింక్‌హోల్‌లో. దక్షిణ చైనాలోని గ్వాంగ్సీ జువాంగ్ అటానమస్ రీజియన్ లేయ్ కౌంటీలోని సింక్‌హోల్‌లో మే 6న గుహ అన్వేషకులు దీన్ని కనుగొన్నారు..

ఈ సింక్‌హోల్ అడుగున 40 మీటర్ల ఎత్తైన చెట్లున్నాయి. అంటే కొబ్బరి చెట్లకంటే రెండింతలు అన్నమాట. దీని అడుగు మొత్తం చెట్లతోనే విస్తరించి ఉంది. ఆ చెట్ల కొమ్మలు సింక్‌హోల్ పైవరకూ ఉన్నాయి. ఈ అడవి చూడముచ్చటగా ఉందని అన్వేషకులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది..

సింక్‌హోల్‌ 1,004 అడుగుల పొడవు, 492 అడుగుల వెడల్పు, 630 అడుగుల లోతుతో ఉంది. ఈ సింక్‌హోల్ ఘనపరిమాణం 5 మిలియన్ క్యుబిక్ మీటర్లకు మించి ఉంది. ఇప్పటివరకు కనిపెట్టిన అన్ని సింక్‌హోల్‌లో ఇదే పెద్దది. ఈ సింక్‌హోల్‌లో ఒక దట్టమైన పెద్ద అడవి పెరిగిపోయింది. ఈ అడవిలో ఉన్న ప్రత్యేకమైన చెట్లు, ఇతర ప్రాంతాల్లో అంతరించిపోయిన మొక్కలు ఇంకా రకరకాల జీవులు ఉండి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కొత్తగా కనిపెట్టిన ఈ పెద్ద సింక్‌హోల్‌తో చైనాలో వీటి సంఖ్య 30కి దాటింది.ఈ అడవిలో చాలా ప్రశాంత మైన వాతావరణం కూడా ఉంటుంది.చూడటానికి అచ్చం మాములు అడవులు మాదిరిగా ఉంటాయి.. మీరు ఆ అద్భుతమైన అడవులను ఒకసారి చూడండి..