‘అంటే సుందరానికి’ నుంచి బిగ్ అప్డేట్… హీరోయిన్ నజ్రియా ఫస్ట్ లుక్ రిలీజ్

-

నాచురల్ స్టార్ నాని నటిస్తోన్న తాజా సినిమా ‘ అంటే సుందరానికీ’ నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. మళయాళీ ముద్దుగుమ్మ నజ్రియా ఫహాద్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. పలు తమిళ, మళయాళ సినిమాలో తెలుగు వారికి పరిచయం అయిన నజ్రియా తొలిసారిగా స్ట్రెయిట్ తెలుగు సినిమాలో నటిస్తోంది. తాజాగా ‘ అంటే సుందరానికీ’ మూవీలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుంది అనేదానికి క్లారిటీ ఇచ్చింది చిత్ర యూనిట్ ఈ సినిమాలో నజ్రియా… లీలా థామస్ గా ఓ క్రిష్టియన్ అమ్మాయి పాత్రలో కనిపించబోతున్నట్లు చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లో తెలుస్తోంది. 

గతంలో ‘ రాజా – రాణి ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు నజ్రియా పరిచయమే. ప్రస్తుతం ఈ అమ్మడు భర్త ఫహాద్ ఫాజిల్ పుష్ఫ సినిమాతో విలన్ గా చేస్తూ… తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చాడు. ‘ అంటే సుందరానికీ’ మూవీకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించగా… వివేక్ సాగర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. జూన్ 10న ఈ సినిమా రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version