పాన్ ఇండియా మూవీ అంటే ఏంటో నాకు తెలియదు – నాని సంచలనం

-

హీరో నాని ప్రస్తుతం చేస్తున్న సినిమా “అంటే సుందరానికి”. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో… అంటే సుందరానికి సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కోలీవుడ్‌ నటి నజ్రియా నజీమ్‌ హీరోయిన్‌ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌ లో వస్తుంది. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి ఇవాళ టీజర్‌ రిలీజ్‌ అయింది. ఈ సందర్బంగా నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అసలు తనకు పాన్‌ ఇండియా మూవీ అంటేనే తెలియదని అన్నారు నాని. ప్రేక్షకులకు విందు భోజనం పెడతాను.అన్ని కధలను ట్రై చేస్తానని.. నా పార్ట్ ఈ సినిమా లో ఎంత ఉందో నటించిన అందరికి అంతే ఇంపార్టెంట్ ఉంటుందన్నారు. వివేకే ఆత్రేయ ప్రేక్షకులను నవ్వించడానికి ఏ డైలాగ్ రాయలేదు.కానీ అందరూ నవ్వుతూ వుంటారు.అది జంధ్యాల గారి సినిమాల్లో చూసాను.మళ్ళీ ఇప్పుడు చూస్తారని తెలిపారు. వేరే వేరే లాంగ్వేజ్ భాషల్లో ఎందుకు చేస్తున్నాము అంటే అందరికి రిచ్ కోసమని.. కన్నడలో డబ్ చేయకుండా డైరెక్ట్ రిలీజ్ చేస్తామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news