యాంటీ రేవంత్ టీం: కొత్త స్కెచ్ వేస్తున్నారుగా?

-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు ఎక్కువే ఉంటాయనే సంగతి తెలిసిందే..ఎవరికి వారే పార్టీలో పెత్తనం చేసే క్రమంలో ఈ గ్రూపు తగాదాలు బాగా ఎక్కువగా నడుస్తాయి. మొదట నుంచి ఈ రచ్చ జరుగుతూనే ఉంది…ఇక రేవంత్ రెడ్డి పి‌సి‌సి అధ్యక్షుడు అయ్యాక మరింత ఎక్కువ స్థాయిలో రచ్చ జరుగుతుంది. రేవంత్ వచ్చాక..పార్టీలో రెండు గ్రూపులే కనబడుతున్నట్లు ఉన్నాయి…ఒకటి రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండే గ్రూపు…మరొకటి వ్యతిరేకంగా ఉండే గ్రూపు.

ఈ రెండు గ్రూపుల మధ్యే రచ్చ నడుస్తుంది..పార్టీలో పెత్తనం చెలాయించాలని రేవంత్ వర్గం చూస్తుండగా, రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేయాలని ఆయన వ్యతిరేక వర్గం ప్రయత్నిస్తుంది. రేవంత్ రెడ్డి పి‌సి‌సి అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి పార్టీలో ఎలాంటి రచ్చ నడుస్తుందో తెలిసిందే. అయితే ఈ రచ్చ ఎప్పటికప్పుడు ముదురుతుంది తప్ప తగ్గడం లేదు. పైగా ఇటీవల రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లు…ఆయన వ్యతిరేక వర్గానికి మంచి ఆయుధం లాగా దొరికాయి.

రెడ్లకి పార్టీ పగ్గాలు ఇస్తేనే…పార్టీకి భవిష్యత్ ఉంటుందని అన్నారు..దీంతో పార్టీలో ఉన్న ఇతర కులాల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా నవ సంకల్ప్ శిబిర్ లో రేవంత్ వ్యతిరేక వర్గం భేటీ అయ్యి…పి‌సి‌సికి సమాంతరంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి, దానికి అధికారాలు ఇవ్వాలని ఏ‌ఐ‌సి‌సిని కోరారు. ఈ కమిటీకి అధ్యక్షుడు రెడ్డి వర్గానికి సంబంధించిన నాయకుడు కాకుండా వేరే వర్గం నేతని పెట్టాలని కోరారు. భట్టి విక్రమార్క గాని, దామోదర రాజనరసింహని గాని అధ్యక్షుడుగా పెట్టాలని కోరుతున్నారు.

అంటే పి‌సి‌సికి అధికారాలతో పాటు సమానంగా ఈ కమిటీకి కూడా అధికారాలు ఉండాలనేది రేవంత్ యాంటీ టీం లక్ష్యం. ఇందులో రెడ్డి వర్గం నేతలు కూడా ఉన్న విషయం తెలిసిందే…వారే ఈ కథంతా నడిపిస్తున్నారు. చూడాలి మరి చివరికి రేవంత్ యాంటీ టీం అనుకున్నది సాధిస్తుందో లేదో.

Read more RELATED
Recommended to you

Latest news