రాజకీయ పరిణామాల మధ్య తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన నటి దివ్యవాణి అతి త్వరలోనే తన భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఆమె సింగిల్ లైన్ ప్రకటనను విడుదల చేశారు. తన తదుపరి కార్యాచరణను మీడియా ద్వారానే వెల్లడిస్తానని దివ్యవాణి ప్రకటించారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు దివ్యవాణి మొన్న ఓ ట్వీట్ పెట్టిన సంగతి తెలిసిందే.
అయితే ఎన్టీఆర్ జిల్లా టిడిపి అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు తో మాట్లాడిన అనంతరం ఆమె ఆ ట్వీట్ ను డిలీట్ చేశారు. ఆ తర్వాత పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. పార్టీలోనే కొనసాగుతున్నట్లు ప్రకటించారు. మళ్లీ అంతలోనే.. ఆ మరునాడు టిడిపికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. టిడిపిని వీడిన దివ్యవాణి త్వరలోనే వైసీపీ లో చేరుతారన్న దిశగా ప్రచారం సాగుతోంది.
మీడియా ద్వార అతి త్వరలోనే నా భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తా.
— DivyaVani (@divyavanioffici) June 3, 2022