డీజే టిల్లు 2 నుంచి అనుపమ ఫస్ట్ లుక్

-

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ వరుస విజయాలను అందుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. చివరిగా ‘కార్తీకేయ2’తో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నారు. రీసెంట్ గా వచ్చిన ‘18పేజెస్’తోనూ ఆకట్టుకున్నారు. అయితే.. చిన్న సినిమాగా విడుదలై.. సెన్సేషనల్ హిట్ సాధించిన సినిమా డీజే టిల్లు. హీరోగా నటించిన సిద్ధు జొన్నలగడ్డ ఆటిట్యూడ్, డైలాగ్స్ యూత్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు సీక్వెల్ గా ‘టిల్లు స్క్వేర్’ రాబోతోంది. రెండో పార్ట్ లో అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఈరోజు ఆమె పుట్టినరోజు. దీంతో మేకర్స్ అనుపమ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి.. శుభాకాంక్షలు తెలియజేశారు.

Anupama Parameswaran First Look released from Dj Tillu 2 | డీజే  టిల్లుస్క్వేర్‌.. అనుపమ పరమేశ్వరన్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌– News18  Telugu

ఈ పోస్టర్‌లో అనుపమ నోస్‌ పిన్‌ పెట్టుకుని అందంగా కనిపించి ఆకట్టుకుంటోంది. తొలిభాగంలోని ‘రాధిక’ను గుర్తుచేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సిద్ధు జొన్నలగడ్డ పుట్టిన రోజు సందర్భంగా గతంలో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అంతకుముందు సినిమా ప్రకటన సందర్భంగా రిలీజ్ చేసిన చిన్న వీడియో కూడా విశేషంగా ఆకట్టుకుంది. తొలి పార్ట్ నిర్మించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ.. డీజే టిల్లు స్క్వేర్ కూడా తీస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news