రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఎస్ఎస్ సినిమా.. బిజెపికి మద్దతు నిజమేనా.. !

-

దర్శకధీరుడు రాజమౌళి సత్తా ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆయన సినిమాను తెరకెక్కించే విధానం క్రియేటివిటీ చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే. ఇప్పటివరకు దర్శకత్వం వహించిన ప్రతి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రం విదేశాల్లో సత్తా చాటి టాలీవుడ్ స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది. సినిమాలో నటీనటులను సన్నివేశాలను తనకు అనుగుణంగా మార్చుకొని అద్భుతంగా సినిమాను తెరకెక్కించడంలో దీటైన వ్యక్తి రాజమౌళి. అయితే ఇతను ఇంతటి ఘనవిజయం సాధించడానికి వెనుక కారణం కుటుంబం కూడా. దాదాపు రాజమౌళి కుటుంబంలో ప్రతి ఒక్కరూ సినిమా రంగంలో ఉన్నవారే. ఏదో ఒక రకంగా అతని సినిమాకు వెనక నుండి నడిపిస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అద్భుతమైన కథలు అందించడంలో ముందు ఉంటారని చెప్పాలి. ఈ తండ్రీ కొడుకులది సక్సెస్ఫుల్ కాంబినేషన్.. అయితే తాజాగా ఆర్ఎస్ఎస్ గురించి ఓ కథను సిద్ధం చేశారు విజయేంద్రప్రసాద్.. ఈ విషయంపై స్పందించిన రాజమౌళి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

రాజమౌళి అమెరికాకు చెందిన ద న్యూయార్కర్ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ సందర్భంగా  “ఆర్‌.ఎస్.ఎస్‌. గురించి నాకు సరైన అవగాహన లేదు. ఆ సంస్థ గురించి విన్నాను కానీ అది ఎలా మొదలైంది.. ఏ రకంగా విస్తరించింది అనే విషయాలు నాకు అంతగా తెలియవు. అయితే నాన్న అర్ ఎస్ ఎస్ గురించి రాసిన స్ర్కిప్ట్‌ చదివా. ఎమోషనల్‌ స్టోరీ అది. చదువుతూ చాలా సార్లు నాకు తెలియకుండానే ఏడ్చేశా.. అయితే ఈ సినిమాను ఎవరు డైరెక్ట్‌ చేస్తున్నారో నాకు తెలీదు. కానీ కథ చాలా ఎమోషనల్‌గా ఉండడంతో నాకు బాగా నచ్చేసింది. వేరే సంస్థ కోసమో, నిర్మాత కోసమో నాన్న తయారు చేసిన కథ అది. అయితే ఆ కథను డైరెక్ట్‌ చేసే అవకాశం నాకు వస్తే అదో గౌరవంగా భావిస్తా. మానవతా విలువలు, బలమైన భావోద్వేగాలు కలిగిన కథ కావడమే దీనికి కారణం.. అంటూ చెప్పుకొచ్చారు..

అయితే రాజమౌళి తన సినిమాల ద్వారా బిజెపి ఎజెండాకు మద్దతు పలుకుతున్నారని ఆరోపణలపై స్పందించారు. దీనిపై మాట్లాడుతూ “బీజేపీ అజెండాకు అనుగుణంగా చరిత్రను, పాత్రలను వక్రీకరించే ఉద్దేశం నాకు లేదు. ఆ పని చేయను కూడా. నేను రూపొందించిన ‘బాహుబలి’ ఫిక్షనల్‌ మూవీ. ఈ సినిమా ద్వారా చరిత్రను వక్రీకరించడం లేదా బీజేపీ ఎజెండాకు అనుగుణంగా పాత్రలను మలచడం కానీ చేయలేదు. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం విషయానికి వస్తే చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు స్వాతంత్య్ర సమరయోధుల పాత్రలను తీసుకుని అల్లుకున్న కథ ఇది. మేం మొదట్లో ముస్లీం టోపీ ధరించిన కొమరం భీమ్‌ పోస్టర్‌ను విడుదల చేశాం. ఆ సమయంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాన్ని ప్రదర్శిస్తే థియేటర్లను పేల్చి వేస్తామని ఓ బీజేపీ నాయకుడు హెచ్చరించాడు. ఆ టోపీ తీయకపోతే నన్ను నడి రోడ్డు మీద కొడతానని కూడా బెదిరించారు. నేను బీజేపీ కి చెందిన వ్యక్తినో కాదో జనమే నిర్ణయించాలి. నాకు అతివాదం అంటే నచ్చదు. అది బీజేపిలో ఉన్నా, ముస్లీం లీగ్‌లో ఉన్నా, మరెక్కడ ఉన్నా అతివాదులంటే నేను అసహ్యించుకొంటాను’ అని తెలిపారు రాజమౌళి.

Read more RELATED
Recommended to you

Latest news