అందుకే బాలీవుడ్​లో ఫ్లాప్స్ ఎక్కువ : అనురాగ్ కశ్యప్

-

బాలీవుడ్.. ఒకప్పుడు దాని వైభవం ఓ రేంజ్​లో ఉండేది. ప్రపంచ సినిమా చూపు బాలీవుడ్​వైపు ఉండేది. కానీ టైం మారింది. వరుస ఫ్లాప్ సినిమాలతో బాలీవుడ్ రేంజ్ ఒక్కసారిగా పాతాళానికి పడిపోయింది. ఈ పరిస్థితిపై బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

హిందీ చిత్ర పరిశ్రమలో విజయాలు తగ్గడానికి కారణం.. సంస్కృతి మూలాల్లోకి వెళ్లకపోవడమే అంటున్నారు ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌. ఆయన దర్శకత్వం వహిస్తున్న ‘దోబారా’ ట్రైలర్‌ విడుదల కార్యక్రమం బుధవారం ముంబయిలో జరిగింది.

 

“చాలామంది దర్శకులకు తాము సినిమా రూపొందించే భాష కూడా రాదు. ఇది సినిమాపై ప్రభావం చూపిస్తుంది. ఇంగ్లిష్‌ తప్ప హిందీ మాట్లాడటం రాని వాళ్లు హిందీ సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నారు. అలాంటప్పుడు వాళ్లు కథ మూలాల్లోకి వెళ్లడం ఎలా సాధ్యం?” అన్నారు.

 

అనురాగ్​ దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘దోబారా’ మిస్టరీ డ్రామాగా తెరకెక్కింది. ఆగస్టు 19న విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news