అన్నమయ్య గృహాన్ని పునఃనిర్మించడానికి ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నమయ్య గృహసాధన సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి లక్ష్మేశ్వర్ దున్న పిలుపునిచ్చారు. తిరుమల కొండపై ఉత్తరామాడ వీధి వరాహ స్వామి ఆలయం వెనుక ఉన్న శ్రీ తాళ్లపాక అన్నమయ్య నివాస గృహం, ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూల్చివేశారు. దీంతో అన్నమయ్య గృహ సాధన సమితి ఆధ్వర్యంలో పది లక్షల సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం చిలుకూరు బాలాజీ దేవాలయంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ దర్శనానికి వచ్చిన టీఎల్‌సీసీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్ ఫామ్‌లో సంతకాలు చేశారు. అలాగే గృహ సాధన పోరాటానికి తమ వంతు మద్దతు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి లక్ష్మేశ్వర్ దున్న మాట్లాడుతూ.. ‘అన్నమయ్య తెలుగులో 32వేల సంకీర్తనలు రాశారు. తెలుగు భాషకు ఎనలేని సేవలు అందజేశారు. అలాంటి మహనీయుడి నివాస స్థలాన్ని టీటీడీ కూల్చివేయడం దుర్మార్గం. టీటీడీ వెంటనే తిరుమల కొండపై అన్నమయ్య ఇంటిని పునఃనిర్మించాలి. అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో 10 లక్షల సంతకాలు సేకరిస్తున్నాము. ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి.’ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఖదిజ్ఞసి రాజు, ఖదిజ్ఞసి గోవిందు లావణ్య, ఖదిజ్ఞసి గార్లపాటి లావణ్య, ఖదిజ్ఞసి అరవింద్ తదితరులు పాల్గొన్నారు.