హైదరాబాద్ : ఆగస్టు 4న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం కానుంది. దేశంలో అన్ని శాఖలను ఇంటిగ్రేట్ చేస్తూ సీసీసీ నిర్మాణం చేపట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. వందల కోట్లతో 18 అంతస్తులతో కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం చేపట్టారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభ ఏర్పాట్లపై సీపీ విస్తృత సమావేశాలు కూడా నిర్వహించారు. ఆగస్టు 4న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించనున్నారు.
19 అంతస్తులున్న ఈ భవనంలో సందర్శకులు 14, 15 అంతస్తుల వరకు వెళ్లేందుకు అధికారులు అనుమతిస్తారు. అక్కడి నుంచి నగరాన్ని 360 డిగ్రీల కోణంలో వీక్షించొచ్చు. టికెట్లు కొన్నవారికే అనుమతి ఉంటుంది. ఆరో అంతస్తులోని కమాండ్ కంట్రోల్ కేంద్రానికి వచ్చి బయటనుంచి పోలీసులు చేస్తున్న ఆపరేషన్‌ను వీక్షించేందుకూ అనుమతిస్తారు.