ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు కూడా ముహూర్తం ఖరారు అయింది. ఈనెల 15వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ కార్యాలయం నుంచి కీలక ప్రకటన వచ్చింది. ఇక ఈ అసెంబ్లీ సమావేశంలో పలు కీలక బిల్లును చర్చకు రానున్నట్లు సమాచారం అందుతుంది.
అంతేకాదు ఈ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలోనే ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధ్యక్షతన సచివాలయం బ్లాక్ 1లో ఉదయం 11 గంటలకు సమావేశం కానుoది మంత్రి మండలి.
ఇక ఈ మంత్రివర్గ సమావేశానికి మంత్రులతో పాటు ఆయా శాఖల అధికారులు కూడా హాజరుకానున్నట్లు సమాచారం అందుతోంది.ఇక ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం జగన్ చర్చించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా పలు పరిశ్రమలకు భూ కేటాయింపులు, అసెంబ్లీ సమావేశాలు వంటి పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.