ఏపీ సీఎం జగన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ఆ పదవిలోంచి బదిలీ చేశారు. బాపట్లలోని మానవవనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంచార్జ్ సీఎస్‌గా నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. సీఎస్ రేసులో నీలం సహాని, సమీర్ శర్మ ఉన్నారు.
ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాశ్ పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే సీఎస్ బదిలీ అధికార యంత్రాంగంలో కలకలం రేపుతోంది. మరో ఐదు నెలలు సర్వీస్ ఉండగానే ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ అయ్యారు. ఎన్నికల ముందు ఏపీ సీఎస్ గా బాధ్యతలు స్వీకరించారు. జగన్ సీఎం అయిన తర్వాత కూడా ఆయనే కొనసాగుతూ వచ్చారు. మార్పు ఉంటుందని ఎవరూ ఊహించలేదు. అయితే రాజకీయ వర్గాల్లోనే ఇదే చర్చనీయాంశంగా మారింది.