ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం

-

ముస్లింల పవిత్ర పండుగ రంజానన్ను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముస్లిం సోదరసోదరీమణులకు శుభాకాంక్షలు (ఈద్ ముబారక్) తెలియజేశారు. నెలవంక కనిపించడంతో శనివారం దేశవ్యాప్తంగా రంజాన్ నిర్వహించనున్నారు. ఈ మేరకు సీఎం జగన్ ఒక ప్రకటనలో తన రంజాన్ సందేశం తెలియజేశారు. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని పేర్కొన్నారాయన. మానవాళికి హితాన్ని బోధించే రంజాన్ పండుగ. సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని సీఎం జగన్ అన్నారు.

AP administration to shift to Vizag in September: CM Jagan Mohan Reddy

కఠోర ఉపవాస దీక్షలతో క్రమశిక్షణ… దానధర్మాలతో దాతృత్వం… సామూహిక ప్రార్థనలతో ధార్మిక చింతన, ఐకమత్యం… ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశం అని సీఎం జగన్ పేర్కొన్నారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అని తెలిపారు. ముస్లిం సోదరులు చేసే ప్రార్థనలు సఫలం కావాలని, అల్లా దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. మనిషిలోని చెడు భావనలను, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని వివరించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news