మాములుగా ప్రభుత్వ ఉద్యోగులకు పదవీవిరమణ కోసం ఒక ఖచ్చితమైన వయసును నిర్దారిస్తారు, ఆ వయసు ప్రకారమే వారు చేసే ఉద్యోగం నుండి తొలగిపోయి మళ్ళీ ఆ ఉద్యోగానికి కొత్త వారు వస్తూ ఉంటారు, ఇది ప్రతి సంవత్సరం రాష్ట్ర మరియు దేశ ప్రభుత్వాలలో జరుగుతూ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలలో ఆయా శాఖలను బట్టి ప్రభుత్వానికి ఉద్యోగ రిటైర్మెంట్ వయసును పెంచే అధికారాలు ఉంటాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక శాఖలో పనిచేసే ఉద్యోగుల కోసం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నాడు. తెలుస్తున్న సమాచారం ప్రకారం దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగులకు పదవీ విరామం సమయాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నాడు. ఏకంగా ఈ శాఖలో పనిచేసే అర్చకులకు ఇక పదవీ విరమణ లేకుండా నృణాయం తీసుకుంది. పైగా ఇలా చట్టం చేయడానికి రాష్ట్ర కాబినెట్ కూడా ఆమోదాన్ని తెల్పడం జరిగింది.
ఇక వీరి పదవీ విరమణ వయసును 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.