ఆన్‌లైన్ గేమింగ్‌ పై జీఎస్టీ బాదుడు ఎంతో తెలుసా..!

-

ఆన్‌లైన్ గేమ్స్ ..ప్రస్తుతం యువతతో పాటు చిన్నపిల్లలు కూడా విపరీత వ్యామోహం పెంచుకుని మానసికంగా కృంగిపోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ప్రమాదకరమైన వ్యసనం ఇది. చేతిలో ఉన్న డబ్బులు పోగొట్టుకోవడం, ఫలితంగా స్థాయికి మించి అప్పులు చేయడం..వాటిని తీర్చలేక చివరికి ఆత్మహత్యలు చేసుకోవడం వంటి సంఘటనలు ఈ మధ్యన చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ గేమింగ్ లపై జీఎస్టీ పెంచింది. ఆన్‌లైన్ గేమ్స్,కేసినో,హార్స్ రేసింగ్ వంటి వాటిపై 28% జీఎస్టీ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.ఈ కారణంతోనైన యువత ఆన్‌లైన్ గేమ్స్ జోలికి పోకుండా ఉంటారని కేంద్రం భావిస్తోంది.ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన 50వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ నిర్ణయానికి కౌన్సిల్ సభ్యులు కూడా సంపూర్ణ ఆమోదం తెలిపారు.

జీఎస్టీ కౌన్సిల్లో తీసుకున్న మిగతా నిర్ణయాలు ఇప్పుడు చూద్దాం…ప్రైవేట్ సంస్థలు అందించే ఉపగ్రహ ప్రయోగ సేవలకు జీఎస్టీపై మినహాయింపు ఇచ్చారు.బేక్ చేయని లేదా వేయించిన ఎక్స్‌ట్రూడెడ్ స్నాక్ పెల్లెట్లపై జీఎస్టీ రేటును 18% నుంచి 5%కి తగ్గించారు.ఇమిటేషన్ జరీ థ్రెడ్‌పై పన్ను రేటు 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గింది. సినిమా టిక్కెట్ల అమ్మకంపై పన్ను మరియు పాప్‌కార్న్ లేదా శీతల పానీయాలు మొదలైన ఆహార పదార్థాల సరఫరా విషయంలో కూడా కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. సినీప్లెక్స్‌లో విక్రయించే ఆహార పదార్థాలపై 18 శాతానికి బదులుగా 5 శాతానికి జీఎస్టీని కౌన్సిల్ ప్రకటించింది. గతంలో రూ.100 లోపు ఉన్న సినిమా టిక్కెట్లపై 12 శాతం జీఎస్టీ విధించగా, రూ.100 పైబడిన టిక్కెట్లపై 18 శాతం జీఎస్టీ విధించారు. దీనితో పాటు, GST తగ్గించబడిన ఇతర ఉత్పత్తులు, గతంలో రూ.100 లోపు ఉన్న సినిమా టిక్కెట్లపై 12 శాతం జీఎస్టీ విధించగా, ఇప్పుడు రూ.100 పైబడిన టిక్కెట్లపై 18 శాతం జీఎస్టీ విధించారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో క్యాన్సర్ మందులను జీఎస్టీ నుంచి మినహాయించారు. ఎవరైనా అరుదైన వ్యాధుల చికిత్సలో ఉపయోగించే డైనటుక్సిమాబ్ అనే క్యాన్సర్ మందుని వ్యక్తిగత అవసరాలకు కూడా దిగుమతి చేసుకుంటే, దానిపై ఐజిఎస్‌టి విధించబడదు అని క్లారిటీ ఇచ్చారు.ఇప్పటి వరకు 12 శాతం పన్ను విధిస్తున్నారు. దీని ఒక్క డోసు ధర రూ.63 లక్షల వరకు ఉంటుంది. అదేవిధంగా, ఫుడ్ ఫర్ స్పెషల్ మెడికల్ పర్పస్ (FSMP) దిగుమతిపై GST నుండి మినహాయింపు కూడా ఆమోదించబడింది. 26 లక్షలు ఖరీదు చేసే, క్రౌడ్ ఫండింగ్ ద్వారా డబ్బు సమీకరించే ఔషధాన్ని జీఎస్టీ పరిధి నుంచి తప్పించాలని ఫిట్‌మెంట్ కమిటీ కోరగా దీనిని కౌన్సిల్ బృందం ఆమోదించింది.

Read more RELATED
Recommended to you

Latest news