గత రెండు రోజుల క్రితం తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు మరియు మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్సు హైదరాబాద్ లోని గచ్చిబౌలి లో కెశవనగర్ ప్రాధమిక పాఠశాలను అనుకోకుండా చూడడం… అక్కడ కనీస సదుపాయాలు కూడా సరిగా లేకపోవడం గమనించి చిన్న వయసులోనే చాలా పెద్ద మనసుతో, ఆ స్కూల్ ను దత్తత తీసుకుని.. దాని అభివృద్ధి కోసం అక్షరాలా కోటి రూపాయలు ఖర్చు పెట్టు కావలసిన అన్ని సదుపాయాలను కల్పించారు. ఈ రోజు ఆ స్కూల్ ప్రారంభోత్సవం చేస్తున్న సమయంలో మాట్లాడిన మాటలు చాలా మెచూర్డ్ గా ఉన్నాయని తెలుస్తోంది. ఈ సందర్భంగా హిమాన్సు మాట్లాడుతూ… నేను మొదటిసారి ఈ స్కూల్ ను చూడడానికి వచ్చినప్పుడు ఆడపిల్లలకు బాత్ రూమ్ లు కూడా లేకపోవడం నన్నెంతో బాధించిందని ఎమోషనల్ అయ్యాడట. ఇటువంటి పరిస్థిత్తులు నేను ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదని ఫీల్ అయ్యాడు హిమాన్సు.
ఆ క్షణంలో అనుకోకుండా నా కాళ్ళ నిండా నీళ్లు వచ్చేశాయి అంటూ కొంచెం ఎమోషనల్ అయ్యాడు. ఇక ప్రజలు కూడా తాత తండ్రి బాటలోనే రాజకీయాలకు అర్హుడువే అంటూ కామెంట్ లు చేస్తున్నారు.