ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైంది. గురువారం ఉదయం 11:30 గంటలకు ఢిల్లీ బయలుదేరనున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1.45 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు. ఆ తర్వాత 2.45 గంటలకు జన్‌పథ్ చేరుకుని ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంశాఖ మంత్రి అమిషాతో భేటి కానున్నారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు వెల్లడించారు.
అయితే ప్రధాని మోడీ, అమిత్ షాతో భేటి అయి.. ఏపీకి సంబంధించిన పలు పెండింగ్ అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు తెలిపారు. కాగా, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏప్రిల్ 5వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. అప్పుడు రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలపై చర్చించారు. ఏపీ విభజన చట్టాన్ని అమలు చేయాలని కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్టు పెండింగ్ నిధులను విడుదల చేయాలని కోరినట్లు సమాచారం.