ఏపీ సిఎం జగన్ సంచలన నిర్ణయం..ఇక జిల్లాకో ఎయిర్ పోర్ట్ ఏర్పాటు

-

పోర్టులు, ఎయిర్‌పోర్టులపై క్యాంప్‌ కార్యాలయంలో ఇవాళ సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ప్రతి జిల్లాకు ఒక ఎయిర్‌పోర్టు ఉండాలన్నది మంచి కాన్సెఫ్ట్‌ అని.. వన్‌ డిస్ట్రిక్ట్‌ – వన్‌ ఎయిర్‌పోర్టు ఉండాలన్నారు. దానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని.. అన్ని జిల్లాల్లో ఒకే రకంగా విమానాశ్రయాల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు.

jagan
jagan

ఇందుకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పన పై దృష్టి పెట్టండి.. బోయింగ్‌ విమానాలు సైతం ల్యాండింగ్‌ అయ్యేలా రన్‌వే అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 6 విమానాశ్రయాల విస్తరణ, అభివృద్ధి పనులతో పాటు, రెండు కొత్త విమానాశ్రాయల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని.. విజయనగరం జిల్లా భోగాపురం, నెల్లూరు జిల్లా దగదర్తి విమానాశ్రయాల పనులు త్వరితగతిన పూర్తి కావాలని వెల్లడించారు. ఇందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని.. నిర్వహణలో ఉన్న విమానాశ్రయాల విస్తరణ పనులను కూడా ప్రాధాన్యతా క్రమంలో చేపట్టండన్నారు. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేయాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news