వాతావరణం అల్లకల్లోలం..ఏపీ సీఎం జగన్‌ కడప జిల్లా పర్యటన రద్దు

-

BREAKING : ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ కడప జిల్లా పర్యటన రద్దు అయింది. కడప ఎయిర్‌పోర్ట్‌ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కారణంగా, ఎయిర్‌ ట్రాఫిక్‌ క్లియరెన్స్ కావడం లేదు. కడప ఎయిర్‌పోర్ట్‌ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కారణంగా పర్యటన రద్దు చేసుకున్నారు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి.

వచ్చే వారం ఈ పర్యటనను అధికారులు షెడ్యూల్‌ చేసే ఛాన్స్‌ ఉంది. దీనిపై అతి త్వరలోనే క్లారిటీ రానుంది. వాస్తవానికి ఇవాళ కడప మాధవి కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ దుగ్గాయపల్లె మల్లిఖార్జునరెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌లో జగన్‌ పాల్గొనాల్సింది. కానీ ఈ పర్యటన రద్దు కావడంతో.. అందరూ నిరాశకు లోనయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news