ఏపీలో కరోనా విజృంభిస్తూనే ఉంది..రోజువారి కేసులు కాస్త తగ్గినట్లు కనిపిస్తున్న..వైరస్ వ్యాప్తి మాత్రం ఆగడం లేదు..రోజు వారి కేసులు గత కొద్ది రోజులుగా రెండువేలకుపైగానే నమోదు అవుతున్నాయి..తాజాగా ఆరోగ్యశాఖ అధికారులు విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో 75 వేల 465 మందికి కరోనా టెస్టులు చేయగా.. కొత్తగా 2,477 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి..ఒక్క రోజులోనే 10 మరణాలు నమోదుకావడం అధికారులల్లో ఆందోళన మొదలైంది.రాష్ట్రంలో ఇప్పటి వరకూ దాదాపుగా 84 లక్షల మందికి కరోనా టెస్టులు చేసినట్లు అధికారులు బులిటెన్లో పేర్కొన్నారు..ఏపీలో మొత్తం 8 లక్షల 33 వేల 208 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి..ఇప్పటి వరకూ కరోనా కాటుకు 6,744 మంది బలయ్యారు..రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆస్పత్రిలో చికిత్సపొంది..8 లక్షల 5వేల 26 మంది డిశ్చార్జ్ అయ్యారని..21 వేల 438 యాక్టివ్ కేసులు ఉన్నాయని బులిటెన్ తెలిపారు అధికారులు.
ఏపీ కరోనా అప్డేట్: స్వల్పంగా తగ్గిన భారీగానే కేసులు!
-