కలకలం : హోంమంత్రికి, డిప్యూటీ స్పీకర్ కి, గవర్నర్‌ కి కరోనా..!

-

 కరోనా కలకలం రేపుతోంది. కేంద్రహోం శాఖ మంత్రి అమిత్‌ షాతో మొదలుకొని,  తమిళనాడు గవర్నర్‌కి, ఏపీ డిప్యూటీ స్పీకర్‌కి  కరోనా సోకింది.

ఏపీ డిప్యూటీ స్పీకర్‌ మరియు బాపట్ల ఎమ్మెల్యే  అయిన కోన రఘుపతికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. స్వల్పంగా జ్వరంతో బాధపడుతున్న ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని వచ్చింది. రఘుపతితో పాటు అతని భార్య, కుమార్తె కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. అయితే వైద్యుల సూచనల మేరకు వారం రోజులు హోం క్వారంటైన్ ఉండాలని నిర్ణయించుకున్నట్టు ఆయన తెలిపారు.

అలాగే తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో ఆయన చెన్నైలోని కావేరి అనే ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అయితే గవర్నర్‌కు ఇన్‌ఫెక్షన్ తక్కువ స్థాయిలోనే ఉందని, ఆస్పత్రికి చెందిన వైద్యుల బృందం ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యం గురించి పరిశీలిస్తుందని ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది. ఈ మేరకు గవర్నర్ ఆరోగ్యంపై కావేరి ఆస్పత్రి యాజమాన్యం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

ఇకపోతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడాఆ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ‘కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో నేను టెస్టులు చేయించుకున్నా. అందులో రిపోర్టు పాజిటివ్ వచ్చింది. నా ఆరోగ్యం బాగానే ఉంది. కానీ, వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో చేరుతున్నా. కొన్ని రోజులుగా నాతో కలిసిన వారు మీరు కూడా టెస్టులు చేయించుకోండి. ఐసోలేషన్‌లో ఉండండి’ అని అమిత్ షా ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news