బ్రేకింగ్: ఏపీలో వాలంటీర్లకు జగన్ బిగ్ షాక్

-

ఏపీలో వాలంటీర్లను పెద్ద ఎత్తున నియమించిన సంగతి తెలిసిందే. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని పెద్ద ఎత్తున నియమించారు. అయితే ఇప్పుడు వారికి ఏపీ సర్కార్ ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా నియమింపబడ్డ వాలంటీర్లకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం… 18 సంవత్సరాల లోపు, 35 సంవత్సరాల వయసు పై బడిన వారిని తక్షణమే విధుల నుంచి తొలగించాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది.

గ్రామ వాలంటీర్ సచివాలయం, వార్డు వాలంటీర్ సచివాలయం శాఖ డైరెక్టర్‌, కమిషనర్‌ జీఎస్‌.నవీన్‌ కుమార్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసారు. తాజా నిర్ణయంతో స్థానిక నేతల ఒత్తిళ్ల మేరకు నిబంధనలకు విరుద్ధంగా వాలంటీర్ జాబ్ పొందినవారికి ఏపీ సర్కార్ చెక్ పెట్టింది. వాలంటీర్లలో బాల కార్మికులు ఉన్నారని టీడీపీ విమర్శలు కూడా చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news