ఏపీ రైతులకు జగన్‌ తీపి కబురు..ఇ–క్రాపింగ్‌ పై సర్కార్‌ కీలక ఆదేశాలు

-

ఏపీ రైతులకు సీఎం వైయస్‌.జగన్‌ తీపి కబురు చెప్పారు. క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ… రైతు పండించిన పంటను కచ్చితంగా ఇ–క్రాపింగ్‌ చేయాలని.. ఈ డేటా ఆధారంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, ఇతరత్రా ఏ కష్టం వచ్చినా రైతును ఆదుకునేందుకు వీలు ఉంటుందని పేర్కొన్నారు.

cm jagan
cm jagan

ఇ–క్రాప్‌ ప్రక్రియను మరింత బలోపేతం చేయాలని.. ఇ–క్రాప్‌ చేసిన తర్వాత డిజిటల్‌ రశీదుతో పాటు, ఫిజికల్‌ రశీదు కూడా ఇవ్వాలని గతంలో స్పష్టంగా ఆదేశాలు ఇచ్చానన్నారు. డిజిటల్‌ రశీదును నేరుగా రైతు సెల్‌ఫోన్‌కు పంపాలని.. ఒకవేళ తనకు నష్టం వస్తే.. ఆ రశీదు ఆధారంగా రైతులు ప్రశ్నించగలిగే హక్కు వారికి వస్తుందన్నారు.

దీనికి సంబంధించిన ఎస్‌ఓపీని బలోపేతం చేయాలని… వీఆర్వో, సర్వే అసిస్టెంట్, అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ల జాయింట్‌ అజమాయిషీ బాధ్యతను అప్పగించాలని ఆదేశించారు. గ్రామంలో సాగుచేస్తున్న భూములు, సంబంధిత రైతుల వివరాలతో కూడిన మాస్టర్‌ రిజిస్టర్‌ను వీరికి అందుబాటులో ఉంచాలని.. జియో ట్యాగింగ్, ఫొటో గ్రాఫ్స్‌ ఇ–క్రాప్‌లో లోడ్‌ చేయాలని చెప్పారు. జూన్‌ 15 నుంచి ఇ– క్రాపింగ్‌ మొదలుపెట్టి, ఆగస్టు చివరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news