జగన్ సర్కార్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!

-

జగన్ సర్కార్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పిల్లల సంరక్షణ సెలవులను పొడిగించింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. చైల్డ్‌ కేర్‌ సెలవలు ఇప్పుడు 60 రోజులు వున్నాయి. కానీ వాటిని 180 రోజులకు పెంచుతున్నట్లు సర్కార్ చెప్పింది.

11 వేతన సవరణ సంఘం సిఫార్సులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారట. అలానే ఉద్యోగులు కనుక దత్తత తీసుకుంటే 180 రోజుల వరకూ తీసుకోవొచ్చు. ఇది ఇద్దరి పిల్లలు కంటే ఎక్కువ పిల్లలు ఉంటే వర్తించదు. పురుషులకి పితృత్వ సెలవు 15 రోజులు.

దత్తత తీసుకున్న ఆరు నెలల లోపు ఈ సేవలను ఉపయోగించుకోవచ్చట. పేమెంట్ కూడా కట్ చేయడం ఉండదు. సెలవు ఏడాది పాటు కూడా తీసుకునే వెసులుబాటు ఉంది. 6-7 నెలల మధ్య వారైతే ఆరు నెలల పాటు సెలవు తీసుకోవచ్చట. 180 రోజుల పాటు మహిళా ఉద్యోగులు సెలవు తీసుకోవచ్చు.

ఇదిలా ఉంటే ప్రమాదకర ప్రాంతాల్లో పని చేసే నర్సింగ్ సిబ్బందికి, ఎముకలు, అవయవాలు సమస్యలతో ఇబ్బంది పడేవాళ్ళు ఏడాదికి ఏడు రోజుల పాటు తీసుకోవచ్చు. కిడ్నీ వ్యాధులు, కేన్సర్, క్షయ, కుష్టు వంటి సమస్యలు ఉంటే అసాధారణ సెలవు మంజూరు చేయడంతో పాటు ఎక్స్‌గ్రేషియాను పెంచారు. ఇలా సర్కార్ మార్పులు చేసారు.

 

Read more RELATED
Recommended to you

Latest news