ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఉద్యోగులకు పిల్లల సంరక్షణ సెలవులను పొడిగించింది. ప్రభుత్వం ప్రస్తుతం 60 రోజులు ఉన్న చైల్డ్ కేర్ లీవ్స్ ను కాస్త, 180 రోజులకు పెంచుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు సెలవులను 10 విడతల్లో ఉపయోగించుకోవాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
11 వేతన సవరణ సంఘం సిఫార్సులకు అనుగుణంగా ఉద్యోగుల సెలవులకు సంబంధించి ఆ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం పిల్లలను దత్తత తీసుకునే ఉద్యోగినులకు దత్తత సెలవు 180 రోజుల వరకు తీసుకోవచ్చు. ఇద్దరు పిల్లలు లోపు ఉన్నవారికి వర్తిస్తుంది. అలాగే ఒక ఏడాది లోపు వయస్సున్న వారిని దత్తత తీసుకున్నప్పుడు సెలవు ఇస్తారు. ఇక పురుష ఉద్యోగులకు ఇలాంటి సందర్భాల్లో పితృత్వ సెలవు 15 రోజులు తీసుకోవచ్చు.