నిరుద్యోగులకు గుడ్ న్యూస్…10,865 ఉద్యోగాలకు నోటిఫికేషన్…!

-

వైద్య విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 10,865 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉద్యోగాలను ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉద్యోగాల్లో ఇప్పటికే ఖాళీగా ఉన్నవి 7,390 కాగా కొత్తగా 3,475 ఉద్యోగాలను సృష్టించారు. ఇక ఈ ఉద్యోగాల్లో 4,142 డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద పోస్టులు ఉన్నాయి.

అదే విధంగా ఏపీవీపీలో 2,520 పోస్టులు ఉన్నాయి. అంతే కాకుండా 4,203 పోస్టులు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలో ఉన్నాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఉద్యోగాలను ఏపీ సర్కార్ ఒకేసారి భర్తీ చేస్తోంది. ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తో వైద్య విద్యను అభ్యసించిన వారికి ఉద్యోగాలు రావడం తో పాటు రాష్ట్రంలో వైద్య సేవలు కూడా మెరుగుపడే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news