తమిళనాడును విడవని వర్షాలు.. రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ.

-

తమిళ నాడు రాష్ట్రాన్ని రెండు వారాలుగా వర్షాలు విడవడం లేదు. ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా మరోమారు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చిరించింది. రాష్ట్రంలో వర్షాల ప్రభావిత ప్రాంతాలు ఎప్పటికప్పుడు మానెటరింగ్ చేయడానికి వార్ రూం ను ఏర్పాటు చేశారు. వర్షాల ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ఎప్పటికప్పుడు సమీక్షించేందకు, రెస్క్యూ చేసేందుకు వార్ రూం సహకరిస్తుంది. ప్రస్తుతం అల్పపీడన ప్రభావంతో చైన్నైతో పాటు తమిళనాడులో పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురువనున్నాయి.

తేని జిల్లాలో గురువారం రోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. అల్పపీడనం కారణంగా గురువారం చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, రాణిపేటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తిరువణ్ణామలై, కళ్లకురిచ్చి, సేలం, పెరంబలూర్, తిరుచిరాపల్లి, కరూర్, తంజావూరు, తిరువారూర్, పుదుక్కోట్టై, దిండిగల్, మదురై, తేని, శివగంగ, విరుదునగర్, తెన్కాసి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news