బీసీ-డీగా మున్నూరు కాపులు.. ఏపీ సర్కార్‌ కీలక ఉత్తర్వులు

-

మున్నూరుకాపు కులస్తులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. మున్నూరు కాపు కులస్తులకు బిసి-డి కింద కులదృవీకరణ పత్రాల జారీకి తాజాగా జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ విషయంపై హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు కృతజ్ఞతలు తెలియ చేశారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు.

cm jagan
cm jagan

తూర్పు గోదావరి జిల్లాలోని చింతూరు, కూనవరం, ఎటపాక మండలాలు పశ్చిమ గోదావరం జిల్లాలోని కుకునూరు, వేలయిర్పాడు బూర్గంపాడు మండలాల్లోని మున్నూరుకాపు కులాన్ని వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.

తెలంగాణ ప్రాంతం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం కాబడిన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలోని ఏడు మండలాలలో నివసిస్తున్న మున్నూరుకాపు కులాన్ని గ్రూప్ -డి కింద వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చిన రాష్ట్ర ప్రభుత్వం.. తెలంగాణ నుండి విలీనమైన మండలాలోని మున్నూరుకాపు కులానికి చెందినవారు అభ్యర్థనకు స్పందించింది. ఈ అభ్యర్థన పై అధ్యయనం చేసి నివేదిక సమర్పించింది ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమీషన్.

Read more RELATED
Recommended to you

Latest news