ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అమరావతి అంశం రగులుతున్న విషయం తెలిసిందే. వికేంద్రీకరణ సీఆర్డీఏ రద్దు కు సంబంధించిన బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేయడం రాజకీయాలను కీలక మలుపు తిప్పింది . అయితే ప్రతిపక్ష టిడిపి ఈ విషయంపై జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఇక ఈ అమరావతి అంశంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
రాజధాని అమరావతి కి సంబంధించి హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపింది ఏపీ హైకోర్టు. ఈ సందర్భంగా పలు కీలక వాదనలు విన్న హైకోర్టు… అమరావతి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అమరావతిలో ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది..? నిర్మాణాలు ఎక్కడ ఆగిపోయాయి..? కట్టిన భవనాలను ఎంతమేరకు వాడుకుంటున్నారు..? దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఒక నివేదిక రూపంలో హైకోర్టులో సమర్పించాలి అంటూ.. రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ ను కోరింది ఏపీ కోర్టు. అంతేకాకుండా ఈ విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది.