టిటిడి బోర్డు మెంబర్ల నియామకంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

-

టిటిడి బోర్డు మెంబర్లలో క్రిమినల్ కేసులు ఉన్నవారు, ప్రత్యేక ఆహ్వానితులు ఎక్కువ మంది ఉన్నారని వేసిన పిటీషన్ పై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. టిటిడి బోర్డు మెంబర్లు 18 మందిలో ఇద్దరు మాత్రమే కౌంటర్ దాఖలు చేయడంపై ఈ సందర్భంగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
దాఖలు చేయని వారిని కూడా కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయకుంటే విచారణ కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఆర్డినెన్స్ తెచ్చిన తరువాత జివో ఇవ్వనందున ఆర్డినెన్స్ చెల్లదని పిటిషనర్ తరుపు న్యాయవాది వాదించారు.

ఆర్డినెస్స్ పై ప్రత్యేకంగా పిటిషన్ వేయమని పిటీషనరుకు సూచించింది ధర్మాసనం. జివోపై హై కోర్టు ఇచ్చిన స్టే పై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇంప్లీడ్ పిటీషన్ దాఖలు చేశారు. దీంతో భూమనకు మాత్రమే ప్రత్యేక ఆహ్వానితునిగా వుండేందుకు అనుమతి ఇచ్చింది ధర్మాసనం.

భూమన కరుణాకరెడ్డి వేసిన ఇంప్లీడ్ పిటీషన్ విచారణకు అనుమతించద్దని ధర్మాసనాన్ని పిటీషనర్ తరుపు న్యాయవాది కోరారు. భూమన స్వప్రయోజనం కోసమే ఇంప్లీడ్ పిటీషన్ వేశారన్న పిటీషనర్ తరుపు న్యాయవాది.. ప్రభుత్వం మెమో కాపీ అందిన తరువాత కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. తాము కౌంటర్ వేసే వరకు స్టే వెకేట్ చేయవద్దని ధర్మాసనాన్ని పిటీషనర్ తరుపు న్యాయవాది కోరారు. మెమో కాపీ అడిగి తీసువాలన్న హైకోర్టు.. తదుపరి విచారణ మార్చి 11కు వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news