కిషన్ రెడ్డి… ఓ నిస్సహాయ, నికృష్ట మంత్రి : కవిత

-

కిషన్ రెడ్డి… ఓ నిస్సహాయ, నికృష్ట మంత్రి అని టిఆర్ఎస్ ఎంపీ మలోత్ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పై కేంద్ర మంత్రి మాటలకు నిరసనగా రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మహబూబ్ బాద్ నియోజకవర్గ కేంద్రంలో నిరసన కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు.

నిస్సహాయ …నికృష్ట మంత్రి కిషన్ రెడ్డి అని.. బయ్యారం స్టీల్ ఫ్యక్టరీ రాదు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారని అగ్రహించారు. కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంకు వంత పాడుతున్నారని మండిపడ్డారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ …తెలంగాణ హక్కు అని పేర్కొన్నారు కవిత. నాణ్యమైన ఉక్కు అక్కడ ఉంది అని సర్వేలు ఉన్నాయని చెప్పారు.బయ్యారంలో ఉక్కు నిల్వలు ఉన్నాయని జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ఇచ్చిందన్నారు కవిత. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కి సంబంధించి కేంద్రంది ఉక్కు సంకల్పం కాదు…అది తుక్కు సంకల్పం అని చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Latest news