అమరావతి: ఏపీ శాసనమండలిని ఏపీ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ అంశం రాజ్యసభకు చేరింది. ఏపీ శాసనమండలి రద్దుకు సంబంధించిన ప్రస్తావన వచ్చింది. దీంతో ఏపీ శాసనమండలి రద్దు అంశం కేంద్రం పరిధిలో ఉందని టీడీపీ ఎంపీ కనకమేడల రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర శాఖ మంత్రి కిరెన్ రిజుజు సమాధానం చెప్పారు. ఏపీ శాసనమండలిని టీడీపీ ఆమోదించాలని రాజ్యసభకు కనకమేడల తెలిపారు.
కాగా ఏపీకి మూడు రాజధానులను ఏపీ శాసనమండలి తిరస్కరించింది. జగన్ అధికారంలోకి రాగానే ఏపీకి మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ మేరకు అసెంబ్లీ, శాసనమండలిలో ఆ బిల్లును పెట్టారు. అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందింది. శాసనమండలిలో వైసీపీ బలం తక్కువ కావడంతో మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందలేదు. దీంతో జగన్ సర్కార్ ఏపీ శాసనమండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లును కేంద్రప్రభుత్వానికి పంపింది. ఈ బిల్లుపై ఆమోదం పొందితే తదుపరి కార్యచరణపై జగన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.