ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ధర్మాన కృష్ణదాస్ కుమారుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కుమారుడికి పాజిటివ్ రావడంతో నిన్నటి నుంచి మంత్రి కృష్ణదాస్ హోం క్వారంటైన్‌కు వెళ్లిపోయారు. బుధవారం జరిగిన వైఎస్ జయంతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎంపీ విజయసాయిరెడ్డి కూడా హోం క్వారంటైన్‌కు వెళ్లారు. 15 రోజుల పాటు క్యాంపు కార్యాలయాలకు రావద్దంటూ స్పీకర్ సూచించారు.
గత కొంతకాలంగా ధర్మాన కృష్ణదాస్ తరపున ఆయన కుమారుడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు కరోనా సోకినట్టు తెలుస్తోంది. కొంతకాలంగా స్వల్ప అస్వస్థతతో ఉన్న ఆయనకు, వైద్యులు కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయనతో పాటు తిరిగిన కార్యకర్తలు ఆందోళనలో ఉన్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 23,814 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 12,154 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 277 మంది చనిపోయారు.