లోన్ యాప్ ఆగడాలపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి కీలక ప్రకటన చేశారు. లోన్ యాప్ ఆగడాలు ఎక్కవవుతున్నాయని.. దీనిపై వెంటనే స్పందించి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. వాళ్ళ గ్యాంగ్ ను వలపన్ని పట్టుకున్నారని.. ఆ గ్యాంగ్ చెన్నై నుండి ఆపరేట్ చేస్తున్నారని తెలిపారు. తెలుగు తెలిసిన వారి ద్వారా అక్కడి నుండి ఆపరేట్ చేస్తున్నారని.. చెప్పారు.
ఫోటోలు మార్పింగ్ చేసిన వారిని కూడా తీసుకు వచ్చామని.. ఇది ఆరంభం మాత్రమేనని పేర్కొన్నారు.
ఆన్ లైన్ యాప్ ద్వారా ఎవరైనా ఇబ్బంది పెడితే మా దృష్టికి తీసుకురండన్నారు. ఫోన్ కాల్ వస్తే కాల్ మనీ కేసుగా వెంటనే చర్యలు తీసుకుంటామని.. ఆన్ లైన్‌కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా మార్పింగ్, ఫేస్ బుక్ లో పెట్టే పరిస్ధితి తగ్గిందని వెల్లడించారు. ఆన్లైన్ యాప్‌లు త్వరలోనే నిర్వీర్యం అయిపోతాయని స్పష్టం చేశారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి.