ఆస్తమా ఉన్నవాళ్లు ఈతకొట్టొచ్చా..? మంచిదేనా..?

-

కోశ వ్యాధి వల్ల మనిషికి ఊపిరి అందక తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ ఆస్తమా చిన్నా పెద్దా తేడా లేకుండా అందరిలోనూ ఉంటుంది. వీరికి ఎప్పుడు ఊపిరి అందడంలో ఇబ్బంది ఎదురవుతుందో చెప్పలేం. సమయానికి ఆక్సిజన్‌ అందకపోతే ప్రాణాంతకం అవుతుంది. ఈ వ్యాధితో బాధపడేవారు వ్యాయామం చేయాలన్నా కష్టమే.. అయినా సరే బరువును అదుపులో ఉంచుకోవడం ముఖ్యం. ఆస్తమా ఉన్నవారు ఈతకొట్టడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు..

ఆస్తమా బాధితులు ఈత కొట్టం వల్ల శ్వాశ తీసుకునే పరిస్థితిపై నియంత్రణను పొందగలుగుతారు. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఆస్తమా లక్షణాలు గణనీయంగా తగ్గుతాయి. ఈత ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈత కొట్టినప్పుడు ఊపిరితిత్తులు పని మెరుగుపడుతుంది. సరిగా.. ఊపిరి పీల్చుకుంటారు. ఇది గణనీయంగా పెరుగుతుంది. దీంతో ఊపిరితిత్తులపై తక్కువ ఒత్తిడి పడి.. ఊపిరితిత్తులను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

రోజువారీ పనుల కోసం ఊపిరితిత్తులపై అదనపు ఒత్తిడిని పెట్టాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. స్విమ్మింగ్ వాపులను తగ్గించగలదు. క్రమం తప్పకుండా ఈత కొట్టినప్పుడు శ్వాసనాళాలలో మంటలు గణనీయంగా తగ్గుతాయి. మంట తగ్గితే సరిగ్గా ఊపిరి పీల్చుకోవచ్చు. ఊపిరితిత్తులపై ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.

స్మిమ్మింగ్ చేయడం వల్ల కండరాలు కూడా బలపడుతాయి. ఈత కండరాల బలాన్ని పెంపొందించడానికి పనిచేస్తుంది. కండరాలు ధృఢంగా ఉంటే రోజువారీ కార్యకలాపాలను సజావుగా చేసుకోవచ్చు.

ఈత సహనాన్ని పెంచుతుంది. చాలా కాలం పాటు ఈత కొట్టడం ప్రాక్టీస్ చేసినప్పుడు, మీ ఊపిరితిత్తులు దానికి అలవాటు పడతాయి. ఇలాంటి వ్యాయామాలు సహనాన్ని పెంచి రిలాక్స్‌గా ఉంచుతాయి. దీంతో పాటు శ్వాస సమస్యలు కూడా క్రమంగా తగ్గుతాయి. ఈతకొట్టడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మనసుకు హాయిగా ఉంటుంది.

ఈతకొట్టడం వల్ల బరువు కంట్రోల్‌లో ఉంటుంది. పొట్ట తగ్గుతుంది. ఈత వల్ల బాడీలో అన్ని పార్ట్స్‌కు ఒకేసారి వ్యాయామం అవుతుంది. కాబట్టి అధికంగా ఉన్న కొవ్వు అంతా కరుగుతుంది. చిన్నప్పుడు నుంచే పిల్లలకు ఈతకొట్టడంలో శిక్షణ ఇప్పిస్తే పెద్దయ్యే సరికి మంచి నైపుణ్యం పొందగలుగుతారు. అయితే ఎక్కడపడితే అక్కడ ఈత కొట్టకుండా పేరెంట్స్‌ జాగ్రత్తపడాలి. లోతు ఎంతుందో తెలియక దూకి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు కోకల్లలు.

Read more RELATED
Recommended to you

Latest news