తెలుగు రాష్ట్రాలలో ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్దం..

-

ఏపీలో ఈరోజు నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే.. మొదటి,రెండొవ సంవత్సరానికి కలిపి  9 లక్షల 14 వేల 423 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరవుతున్నారు.వృత్తి విద్యా పరీక్షలకు 87,435 మంది విద్యార్ధులు హజరవుతున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,456 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షా కేంద్రాలు ఉన్న మార్గాల్లో రెగ్యులర్ బస్ సర్వీసులు ఏవీ రద్దుచేయకుండా నడపాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు జిల్లా అధికారులను ఆదేశించారు..

విద్యార్థులను ఆయా ప్రాంతాలలోని పరీక్షా కేంద్రాలలో వదిలిపెట్టి, మళ్ళీ పరీక్షల అనంతరం తీసుకురావాలని అధికారులు తెలిపారు.విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నీ రకాల ముందస్తు చర్యలను తీసుకున్నట్లు అధికారులు అంటున్నారు..విద్యార్థులంతా ఉదయం 8 గంటల 30 నిముషాలలోపే పరీక్షాకేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎప్పటిలాగే.. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేశారు.

ఏపీలో ఇప్పటికే ప్రారంభమైన పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీకుల వ్యవహారం రాజకీయ చర్చలకు దారి తీసింది. ఇప్పటికే ప్రభుత్వం తీరుపై విమర్శలు కొనసాగుతున్నాయి. అయితే విద్యాశాఖ మంత్రి బొత్స పేపర్ లీక్ కాలేదని ప్రతి పక్షాలు కుట్ర పన్నారని ఆరోపించారు..ఇప్పుడు జరగనున్న ఇంటర్ పరీక్షలు సర్కార్ కు ఛాలెంజ్ గా మారాయి.ఆంధ్రప్రదేశ్ 24వ తేదీ వరకు.. తెలంగాణలో 23వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. తెలంగాణలో మే 20 నుంచి టెన్త్‌ పరీక్షలు ప్రారంభంకానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news