మరోసారి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. పాలమూరు అంటేనే జోష్… అందుకే ఈ గడ్డ నుంచే 2వ విడత పాదయాత్ర చేపట్టామని, తెలంగాణలో వచ్చేది బీజేపీనే అని జేపీ నడ్డా అన్నారన్నారు. పాదయాత్రలో అశేషంగా, విశేషంగా తరలివచ్చిన పాలమూరు ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాని ఆయన అన్నారు. అమ్మవారిని దర్శించుకున్నా… స్వామివారి ని దర్శించుకోలేకపోయా… బీజేపీ అధికారంలోకి రాగానే వస్తానని మొక్కుకున్నా.. మన్యంకొండ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని తిరుపతి బాలాజీ ఆలయంలా అభివృద్ధి చేస్తానన్నారు. పాలమూరు ప్రజలపై కేసీఆర్ పగబట్టాడని, ఆర్‌డీసెస్ హామీ ఏమైంది కేసీఆర్? అని ఆయన ప్రశ్నించారు.
ఆర్‌డీఎస్ ఆధునీకరణ ఎందుకు చేయడం లేదు.. ఆర్‌డీఎస్ సమస్యను నువ్వు సహకరిస్తే… 6 నెలల్లో నరేంద్రమోదీ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఎడారిగా మారిన పాలమూరు లో రైతులు చనిపోతున్నారని, వరి కొంటా అంటాడు… మళ్లీ కొన అని అంటారన్నారు. సీఎం నిర్వాకంతో అకాల వర్షాల కారణంగా ధాన్యం కొట్టుకుపోయి రైతులు నష్టపోయారని, తెలంగాణ ద్రోహి కేసీఆర్ అంటూ ఆయన మండిపడ్డారు. కృష్ణా జలాల్లో 575 టీఎంసీల నీటి వాటా తెలంగాణ కు రావాల్సి ఉండగా…. చంద్రబాబు కి అమ్మాడుపోయి 299 టీఎంసీలకు ఒప్పుకుని, ప్రజలను మోసం చేసిన ద్రోహి కేసీఆర్ అంటూ ఆయన దుయ్యబట్టారు. పాలమూరులో వలసలు ఉన్నాయని నేను నిరూపిస్తా కేసీఆర్ అని ఆయన సవాల్ విసిరారు.