Breaking : ఏపీ టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల

-

ఇటీవల ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. అయితే.. నేడు పదో తరగతి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఉదయం 10 గంటలకు విడుదల చేశారు. 64.23 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను www.sakshieducation.com లో చెక్‌ చేసుకోవచ్చు. టెన్త్‌ సప్లిమెంటరీకి 2,02,648 దరఖాస్తు చేయగా.. 191800 మంది పరీక్షలు రాశారు. బాలురులో పాసైన వారి సంఖ్య 66458 ఉత్తీర్ణతా శాతం 60.83 శాతం. పాసైన బాలికల సంఖ్య 56678. ఉత్తీర్ణత శాతం 68.76 శాతం. మొత్తంగా బాలికలు, బాలురు కలుపుకుని 1,23,231 మంది పాసయ్యారు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 87.52 శాతం ఉత్తీర్ణత రాగా.. పశ్చిమగోదావరి జిల్లా అత్యల్పంగా 46.66 శాతం ఉత్తీర్ణులయ్యారు.

AP 10th Supplementary Exam Results 3rd August 2022 - Sakshi

రెగ్యులర్, అడ్వాన్స్ సప్లిమెంటరీతో కలుపుకుని మొత్తంగా పదవ తరగతి పరీక్షలకి 6,06,070 పరీక్షలకి హాజరు కాగా.. 5,37,491 మంది ఉత్తీర్ణతా సాధించారు. మొత్తంగా ఉత్తీర్ణతా శాతం 88.68. ఈ‌ ఒక్క సంవత్సరమే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలలో పాసైన‌వారిని రెగ్యులర్ పాస్‌గా పరిగణిస్తామని, కోవిడ్ కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు మంత్రి బొత్స సత్యనారాయణ.

 

Read more RELATED
Recommended to you

Latest news